• Login / Register
  • ఎడ్యుకేష‌న్

    Group-3 Key | గ్రూప్‌-3 ప్రాథ‌మిక కీ విడుద‌ల‌

    Group-3 Key |  గ్రూప్‌-3 ప్రాథ‌మిక కీ విడుద‌ల‌
    టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వివ‌రాలు

    Hyderabad : రాష్ట్రంలో గ్రూప్-3 ప‌రీక్ష ప్రాథ‌మికీ బుధ‌వారం టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన కీని టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అభ్య‌ర్థుల వ్య‌క్తిగ‌త లాగిన్‌లో అందుబాటులో ప్రాథ‌మిక కీని ఉంచిన‌ట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు గ్రూప్-3 కీ అందుబాటులో ఉంటాయ‌న్నారు. ప్రాథ‌మిక కీ పై అభ్యంత‌రాల‌ను కేవ‌లం ఇంగ్లీష్‌లోనే తెలుపాల‌ని అభ్య‌ర్తుల‌కు అధికారులు సూచించారు. అయితే న‌వంబ‌ర్ 15, 16 తేదీల్లో గ్రూప్-3 ప‌రీక్ష‌లను నిర్వ‌హించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. కాగా ఈ ప‌రీక్ష‌కు కేవ‌లం 50 శాతం మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.
    *  *  *

    Leave A Comment